హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మహిళలూ జాగ్రత్త.. రోజూ బిస్కెట్లు తింటున్నారా?

రోజూ బిస్కెట్లు తినే మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లలో ఉండే మైదా, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల బరువు పెరగడం, చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొందరిలో జీర్ణ సమస్యలు, మొటిమలు కూడా రావచ్చు. బిస్కెట్లకు బదులుగా పండ్లు, నట్స్ తీసుకోవడం మంచిది. బిస్కెట్లు తినే ముందు వాటిలోని పోషక విలువలను పరిశీలించాలి.