హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మఖానాతో ఆరోగ్య ప్రయోజనాలు

మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉండటంతో స్నాక్‌గా తీసుకోవడానికి ఇది బెటర్. రోజూ మితంగా తింటే శరీరానికి శక్తినిచ్చి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.