WNP: పానగల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీటి ఛాంబర్ ప్రమాదకరంగా మారింది. దానిపై ఉన్న ఇనుప గ్రిల్ ధ్వంసం కావడంతో రాళ్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఇది కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా వర్షపు నీటి ఛాంబర్


