హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఎమ్మెల్యే

KMM: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సండ్ర తెలిపారు.