హైదరాబాద్: 28°C
తెలంగాణ

జల సంరక్షణపై విద్యార్థుల ప్రతిజ్ఞ

JN: రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాలలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం డాక్టర్ భారత రవీందర్ మాట్లాడుతూ నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎకో క్లబ్ ఇన్ఛార్జ్ జి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.