హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబానికి మూడు కీలక పదవులు..!

ASR: పోలవరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తల్లి కృష్ణవేణి రాజవొమ్మంగి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె తంటికొండ ఎంపీటీసీగా విజయం సాధించారు. మరోవైపు ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ జడ్పీటీసీగా గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబానికి ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు దక్కడం విశేషం.