హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒడిశాలో కాకినాడ జాలర్ల ఆశ్రయం

అక్వాన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కాకినాడ నుంచి వేటకు వెళ్లిన సుమారు 80 మంది మత్స్యకారులు ఒడిశాలోని గంజాం జిల్లా ఆర్యపల్లి ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో ఆశ్రయం పొందారు. 10 మోటారు పడవల్లో వెళ్లిన వీరికి గంజాం యంత్రాంగం సౌకర్యాలు కల్పించింది. సముద్రం శాంతించాక తిరిగి వస్తారు. 21వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.