హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో రష్మిక మందన్న ప్రత్యేక పూజలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సినీ నటి రష్మిక మందన్న సందడి చేశారు. సత్యసాయి బాబా మహాసమాధిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు రష్మికకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.