హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20న జడ్పీ పీఠానికి ఎన్నికల నిర్వహణ

W.G: జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికల కోసం ఈ నెల 20న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం పాత బస్టాండ్ సమీపంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.