హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బోణి

W.G: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి బోణి కొట్టింది. 38వ వార్డు నుండి టీడీపీ అభ్యర్థిగా బుద్ధరాజు విజయలక్ష్మి కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కావలి చంద్రావతి గురువారం తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ నేతలు కావలి చంద్రావతి ఆమె భర్త శ్రీనివాసరావులు మంత్రి రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.