హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా గామాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.