హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైప్‌లైన్ లీకేజీ... వృథాగా పోతున్న తాగునీరు

KKD: సామర్లకోట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో మున్సిపల్ తాగునీటి పైప్‌లైన్‌కు లీకులు ఏర్పడి నీరు పెద్దఎత్తున డ్రైనేజీ కాలువలోకి వృథాగా పోతోంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. విలువైన తాగునీరు వృథా అవుతుండటంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.