హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేళ్లచింతలగూడెంలో నామినేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

E.G: వేళ్లచింతలగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నామినేషన్ హెల్ప్ డెస్క్ అభ్యర్థులకు ఎంతగానో తోడ్పడుతోంది. నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలు, ధ్రువపత్రాలు, దరఖాస్తుల వివరాలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియ సులభతరమవుతుండగా, సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతోంది.