హైదరాబాద్: 28°C
క్రీడలు

అథ్లెట్‌కు తీవ్ర గాయాలు.. కుడిచేయి తొలగింపు

మలేషియా స్టార్ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ స్వర్ణ విజేత మొహమ్మద్ హఫీజుద్దీన్ రోస్లిన్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయం తప్పించేందుకు వైద్యులు అతడి కుడిచేతిని తొలగించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య తెలిపింది. ఈ యువ క్రీడాకారుడి కెరీర్‌కు ఇది తీరని లోటుగా మారింది.