హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్‌కు షాక్.. స్టార్ బౌలర్ దూరం

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న ఆతిథ్య పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా ఇన్-ఫామ్ పేసర్ సాకిబ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఇక బౌలింగ్ చేయలేడని పీసీబీ ప్రకటించింది. బౌలింగ్ చేస్తూ అసౌకర్యంతో మైదానం వీడిన సాకిబ్ దూరం కావడం, సిరీస్ విజయంపై కన్నేసిన పాక్ జట్టుకు గట్టి దెబ్బగా మారింది.