హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కీ డ్రాలో ఓబుళరెడ్డి ఎన్నిక

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవరచెరువు ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి పిట్టా ఓబుళరెడ్డి ఎన్నికయ్యారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలలో టీడీపీకి 7, వైసీపీకి 7 స్థానాలు రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో పిట్టా ఓబుళరెడ్డిని అదృష్టం వరించింది. ఆయనకు గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది.