హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కోనసీమ: అయినవిల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్యాయం చేశారంటూ జనసేన పార్టీలోని ఒక వర్గం వారు ఆరోపిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే బయటకు రావాలి అంటూ ఆందోళన చేశారు. ఎస్సై జ్యోతి పరిస్థితిని చక్కబెడుతున్నారు.