హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ

కడప నగరంలో ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. నవంబర్ 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరగనున్న జాతీయ మహాసభలకు మద్దతుగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఎర్రముక్కపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా సాగి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగిసింది.