KRNL: నందవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సంగీత దేశాయ్ (భర్త గురురాజారావు దేశాయ్) నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రభుత్వ నిధుల్లో ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధికి వినియోగిస్తానన్నారు. నందవరాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నందవరం అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం'


