హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఎన్నికపై ఉద్రిక్తత..!

PPM: మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ చెరో ఏడు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీ ఎంపీటీసీ టీడీపీలో చేరేందుకు వెళ్లగా వైసీపీ నాయకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.