కోనసీమ: యర్రపోతవరం వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అద్దంపల్లి గ్రామానికి చెందిన వాసా సత్యనారాయణ (70) మృతి చెందడం పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం, తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి సుభాష్ భరోసా


