VZM: గజపతినగరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గా గంటేడ శ్రీదేవి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అలాగే మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా కనకల మల్లేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ వైస్ ఎంపీపీ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు కొండపల్లి కొండలరావు ఎంపీడీవో కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవి


