SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్న వృత్తి విద్యా శిక్షణను జిల్లా వృత్తి విద్యాధికారి ఆర్. సురేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలు, ఇప్పటివరకు పొందిన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వృత్తి విద్య శిక్షణ విద్యార్థులకు ఎంతో కీలకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వృత్తి విద్యా శిక్షణ ఎంతో కీలకము'


