అన్నమయ్య: మదనపల్లె మండల పరిషత్ అధ్యక్షుడిగా బీదం గురునాథ్ యాదవ్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొన్నేటిపాలెం ఎంపీటీసీ సభ్యుడైన ఆయన ఎన్నిక అనంతరం మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె ఎంపీపీగా గురునాథ్ యాదవ్


