హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 129 నామినేషన్లు రిజెక్ట్

నెల్లూరు జిల్లాలో పంచాయతీల మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 134 సర్పంచ్ స్థానాలకు 831 మంది నామినేషన్లు వేశారు. పరిశీలన అనంతరం 702 నామినేషన్లు ఆమోదం పొందాయి. వివిధ కారణాలతో 129 రిజెక్ట్ చేశారు. అలాగే 1,332 వార్డు స్థానాలకు 3,547 మంది నామినేషన్లు వేయగా.. 3,445 నామినేషన్లను ఆమోదించారు. మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి.