హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజగోపాల్ వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆరా

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై నివేదిక కోరింది ఏఐసీసీ. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎం భాషను తప్పుపట్టారు. ప్రసంగ వీడియోలను టీపీసీసీ పంపింది. ఇంతవరకు చర్యలు లేవు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని నేతలు ఆందోళన చెందుతున్నారు.