హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

బాపట్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులతో కలిసి కోన రఘుపతి కార్యాలయానికి చేరుకోగా, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.