హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యత్మక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు సమస్యాత్మక గ్రామంలో ఎన్నికల ఏర్పాట్లను తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ గురువారం పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.