హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో జ్వరాల కలకలం

PLD: మాచవరం(M) పిల్లుట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)లో జ్వరాలు ప్రబలడంతో 20నుంచి 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గు, తలనొప్పితో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంత మందిని ఇళ్లకు పంపించగా, మరికొందరికి మాచవరం, పిడుగురాళ్ల ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.