హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రూరల్ SI వి. వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.5,100 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.