హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డ్రగ్స్ కలకలం..!

VSP: నగరంలోని ఎంవీపీ కాలనీ పరిధిలో డ్రగ్స్ కలకలం రేగింది. కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఒక వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. సరఫరా ఎవరు చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.