హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన

BHNG: కార్తిక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయ ఈవో భవానీ శంకర్, వేద పండితులు, అర్చకుల సమక్షంలో పూజలు ప్రారంభించారు. కోటి నామాలు, కోటి పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.