హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.99కే కిలో చికెన్.. దస్తురాబాద్‌లో సందడి

NRML: దస్తురాబాద్ మండల కేంద్రంలోని భారత్ చికెన్ సెంటర్ నిర్వాహకులు గురువారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. కేవలం రూ. 99లకే కిలో చికెన్ విక్రయించడంతో మాంస ప్రియులు ఉదయం నుండే దుకాణం ముందు బారులు తీరారు. కిలోల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తూ సందడి చేశారు. ఈ బంపర్ ఆఫర్‌తో గురువారం నాడే దస్తురాబాద్ వాసులు ఎంచక్కా ఘుమఘుమలాడే కోడి కూర వండుకుని ఆరగించారు.