హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యుల కొరత

BDK: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత రోగులకు ఇబ్బందిగా మారుతోంది. 200 పడకల స్థాయికి చేరిన ఆసుపత్రిలో 63 వైద్య పోస్టులకు కేవలం 22 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 41 పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యసేవలపై ప్రభావం పడుతోంది. ఖాళీలను భర్తీ చేసి యుద్ద ప్రాతిపదికన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.