హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు 83,430 ఇందిరమ్మ చీరలు

MLG: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ములుగు జిల్లాకు 83,430 చీరలు చేరాయి. గ్రామీణ ప్రాంతాలకు 78,860, మునిసిపాలిటీకి 4,570 కేటాయించారు. సాధారణ మహిళలకు 6.3మీటర్లు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న వారికి 9మీటర్ల చీరలు అందించనున్నారు. మూడు గోదాముల్లో నిల్వ చేశారు. 424 స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు అర్హులైన వారికి ఇందిరా గాంధీజయంతి సందర్భంగా పంపిణీ చేయనున్నారు.