హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔషధ దుకాణాల్లో నిబంధనలకు తూట్లు

KMM: జిల్లాలో ఔషధ దుకాణాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఫార్మసిస్టు అర్హత పత్రం ఉన్నవారే దుకాణాలను నిర్వహించాలనే నిబంధన గాలికి పోయింది. సుమారు 80 శాతం మంది సొంత సర్టిఫికెట్లు లేకుండానే, ఇతరుల పేరు మీద లైసెన్సులు పొంది ‘గుడ్‌విల్‌’ పేరిట వ్యాపారం చేస్తున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుండటంతో ముప్పు వాటిల్లుతోంది