హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై దాడి.. పెట్రోల్ పోసి నిప్పంటించే యత్నం

KRNL: వగరూరులో మహిళపై దాడి ఘటన కలకలం రేపింది. వాహనం విషయంలో జరిగిన గొడవతో కట్టుబడి సుభానీపై భర్త ఉస్సేన్, అతడి సోదరులు అబ్దుల్లా, చాంద్ బాషా దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు అడ్డుకొని బాధితురాలిని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.