హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

NDL: ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు కర్నూలులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నంద్యాల జిల్లాలోని మిడుతూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.