హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరు ఎంపీపీగా కొత్త శ్రీదేవి ఎన్నిక

ఏలూరు గ్రామీణ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా కొత్త శ్రీదేవిని ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చాటపర్రు నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. తనను ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ఎంపీటీసీ సభ్యులకు, పూర్తి సహకారం అందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.