VSP: బీచ్ రోడ్లోని గిరిజన సహకార సంస్థ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భవనం శిథిలావస్థకు చేరినందున కార్యాలయాన్ని ప్రైవేట్ భవనంలోకి మారుస్తున్నట్టు జీసీసీ ఎండీ ఎస్ఎస్ శోబిత చెప్పారు. జీ- ప్లస్- టు తరహాలో రూ. 7 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తారు. కింద భాగంలో కాఫీ కేఫ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జీసీసీ నూతన భవనానికి ఆమోదం


