హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన

ఖమ్మం పాకబండబజార్‌లోని ఓ స్కూల్ వద్ద గురువారం విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు పీఈటీ తీరుపై మండిపడ్డాయి. స్కూల్ అనుమతిని రద్దు చేసి, పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.