హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

PLD: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలతో అదనపు ఎస్పీ ఎల్.శేషాద్రి బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్ పాలెం, నాగిరెడ్డి పాలెం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. డ్రోన్, సీసీటీవీ, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా ఉంచి 100 మీటర్ల నిబంధన పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.