MHBD: దంతాలపల్లిలో భారతరత్న ఇందిరాగాంధీ 109వ జయంతిని మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆమె అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరాగాంధీకి ఘన నివాళి


