హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్నబియ్యం అక్రమ దందా.. 77 కేసులు నమోదు

NZB: జిల్లాలో పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతోంది. లబ్ధిదారుల నుంచి కిలో రూ.12 నుంచి రూ.20కు కొనుగోలు చేస్తున్న దళారులు, పాలిష్‌ పట్టించి మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. జిల్లాలో గత ఆరు నెలల్లో రూ.1.40 కోట్ల విలువైన బియ్యం పట్టుబడగా, 77 కేసులు నమోదయ్యాయి.