హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయంలొ చేయూత పింఛన్‌లలో భాగంగా ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై 760 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 5 వేలకు పైగా నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయన్నారు.