RR: తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు కాసు శ్రీనివాసరెడ్డి, నాయకులు ఇందిరా చిత్రపటానికి నివాళులర్పించారు. పేదల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. మోహన్ రెడ్డి, రవీందర్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తలకొండపల్లిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి


