JGL: జగిత్యాల పట్టణంలోని 2వ వార్డులో చెత్త వాహనాలు రాక వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దోమలు, ఈగలు పెరిగి చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
చెత్త సేకరణ చేయడం లేదని కమిషనర్‌కు వినతి


