హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన చదరంగం పోటీలు

RR: షాద్‌నగర్ గ్రేడ్-వన్ శాఖ గ్రంథాలయంలో 59వ వారోత్సవాలు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూరు విశ్వం ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, చదరంగం పోటీలను ప్రారంభించారు. విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.