హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం

KNR: రామడుగు మండలం వెలిచాలలో ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వీర్ల నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లను పూలతో అలంకరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.