BHPL: రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు. దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
తెలంగాణ
ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర


